జమౌళి ప్రస్తుతం కుటుంబంతో కలిసి కర్ణాటక టూర్ లో ఉన్నారు.ఇటీవలే ఆయనకు కరోనా సోకగా దాని నుంచి పూర్తి గా కోలుకున్నారు.. ఇక ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తర్వాత అందరు షూటింగ్ లు మొదలుపెట్టగా రాజమౌళి మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు.. ఇప్పటికే 2021 సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది కాబట్టి కనీసం వేసవికైనా రావాలని అభిమానులు కోరుతున్నారు.  అయితే అదికూడా సాధ్యం కాదని తెలిసిపోతుంది.. కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయి వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి వచ్చి థియేటర్లు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నప్పుడే ఆర్ఆర్ఆర్ లాంటివి కమర్షియల్ సేఫ్ అవుతాయి.