మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అందుకోసం వరుణ్ చాలానే కష్టపడుతున్నాడు. ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై చిత్రబృందం ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే వరుణ్ ట్వీట్ తో ఈ సినిమాలో ఉపేంద్ర ఎంట్రీ ఖాయమైపోయింది.