తాజాగా మరో సినిమా ని కూడా చైతు ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా తో మంచి హిట్ కొట్టిన వెంకి అట్లూరి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చైతుకి చెప్పిన ఓ పాయింట్ బాగా నచ్చిందంట. దాంతో డెవలప్ చేశాక మాట్లాడుకుందామని అనుకున్నట్టు సమాచారం. వెంకీ గతంలో అఖిల్ తో మిస్టర్ మజ్ను రూపంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు అన్నయ్యతో హిట్టు కొట్టే స్కెచ్ ఏదో వేసినట్టు కనిపిస్తోంది.ఇక ఎలాగు విక్రం కుమార్ సినిమా పూర్తవడానికి టైం ఉంది ఈలోప తాను చేస్తున్న నితిన్ రంగ్ దే సినిమా ని పూర్తి చేసి చైతు సినిమా పై ఫోకస్ చేయనున్నాడట..