పాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ 2 సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా సంక్రాంతి కి రాబోతుందని అంటున్నారు.. ఓ ఇరవై శాతం మాత్రమే బాలన్స్ ఉన్న దీని షూటింగ్ నవంబర్ లో పూర్తి చేసి డిసెంబర్ లో ఫైనల్ కాపీ ప్లస్ సెన్సార్ చేయించుకునేందుకు దిల్ రాజు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇక గోపిచంద్ తమన్నా కాంబోలో రూపొందిన సీటిమార్, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ , నాగ చైతన్య లవ్ స్టొరీ, బెల్లం కొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు సంక్రాంతి కి వచ్చే ఆలోచనలో ఉన్నాయి..