రామ్ చరణ్ RRR సినిమా తో పాటు ఆచార్య సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇదే నిజమైతే ఈ రెండు సినిమాల డేట్స్ క్లాష్ అయ్యే ప్రమాదముందట.. తాజా సమాచారం మేరకు అక్టోబర్ నుంచి రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అలియా భట్ కూడా తాను వచ్చే రెండు నెలలు ఖాళీగా ఉన్నానని, అడిగితే హైదరాబాద్ కు రావడానికి సిద్ధమని కబురు పంపిందట. అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ ఆచార్య కు డేట్ ఇచ్చారు.. దాంతో ఇప్పుడెలా అని ఇద్దరు దర్శకులు తలలు పట్టుకున్నారట..