రికార్డుల రారాజు గా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న పేరు సంగతి అందరికి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్లు చూస్తే ఆయనకి ఇంతమంది అభిమానులు ఉన్నారా అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో హీరో గా చేస్తున్న సంగతి తెలిసిందే..బాలీవుడ్ 'పింక్' సినిమా కి ఈ సినిమా రీమేక్ కాగా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పైగా పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో సహజంగా నే ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు..