‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ బాలీవుడ్‌కు వెళ్లడమే ఇక్కడి జనాలకు నచ్చలేదు. కనీసం ఆ సినిమా పూర్తి చేసుకుని అయినా వస్తాడనుకుంటే.. ‘కబీర్ సింగ్’ నిర్మాతలతోనే తన తర్వాతి బాలీవుడ్ ప్రాజెక్టును అనౌన్స్ చేసి నిరాశకు గురి చేశాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.. దానికి బదులు హిందీ లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.. అలాగే ఓ చిన్న సినిమాను స్వీయ నిర్మాణంలో తీయబోతున్నాడని ఇంకొందరు అంటున్నారు. కానీ ఏ విషయంలోనూ అధికారిక సమాచారం లేదు. ఏదేమైనా అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమా చేసినా సందీప్ వంగ కి ఇంకా పెద్ద హీరో డేట్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యమే..