విజయ్ ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.. సుప్రసిద్ధ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ప్రొడక్షన్ లో అభిషేక్ కపూర్ దర్శకుడిగా తెరకెక్కబోయే ప్రాజెక్ట్ లో రౌడీ బాయ్ ని హీరోగా తీసుకోవడం దాదాపుగా ఓకే అయినట్టు ముంబై టాక్.అది కూడా అభినందన్ బయోపిక్ అని తెలుస్తుంది. 2019లో పుల్వామా దాడుల్లో దొరికి అక్కడి చెరను ధీటుగా ఎదురుకుని నిలబడిన కమాండర్ అభినందన్ కథనే విజయ్ చేస్తున్నాడట.. ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా పాతుకు పోవడం ఖాయమనిపిస్తుంది. మరి అధికారిక ప్రకటన వస్తేనే కానీ దీనిపై ఏమీ చెప్పలేము..