కరోనా కారణం గా ఈ సినిమాలు నిలిచి పోయాయి.. అయితే థియేటర్లు ఇంకా ఓపెన్ కాకపోవడంతో అందరు OTT ల వైపు వెళ్తుండడంతో శర్వానంద్ శ్రీకారం కూడా OTT బాటపడుతుందని అంటున్నారు..ఇప్పటికే నాని హీరోగా, దిల్ రాజు నిర్మించిన 'వి' చిత్రం కూడా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అయిపోయింది. దిల్ రాజు వంటి నిర్మాతే అలా డిజిటల్ రిలీజ్ ఎంచుకోవడంతో, మరికొందరు నిర్మాతలు కూడా ఆ మార్గాన్నే అనుసరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకారం నిర్మాత కూడా ఓటీటీ ద్వారా డైరెక్టు రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.