విడుదల చివరి నిమిషంలో ఆగిపోయిన సినిమాలు ఇన్ని రోజులు థియేటర్ల ఓపెన్ కోసం వెయిట్ చేసి ఇప్పట్లో ఆ అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చి మెల్లగా ఓటీటీ దారి పడుతున్నారు. కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా వాటిని కూడా పూర్తి చేసి ఓటీటీకి ఇస్తున్నారు. కాని రానా 'అరణ్య' సినిమాను మాత్రం ఓటీటీకి ఇచ్చేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. అందుకు కారణం దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న రానా సినిమా ను ఇలా OTT లో రిలీజ్ చేసి తన స్టార్ డం ని తగ్గించడం ఏమాత్రం ఇష్టం లేదని మేకర్స్ అంటున్నారట..