మెగా స్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు మంచి పోటీ ఇస్తున్నాడు.. ఇప్పటికే సైరా తో హిట్ కొట్టిన చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత వేదలమ్ రీమేక్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.. ఆ తర్వాత వివి వినాయక్ తో లూసిఫర్ రిమేక్ చేయబోతున్నారు.. వీటి తర్వాత బాబీ సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇక బాబీ ప్రస్తుతం స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.