సుకుమార్ ఇంట్రెస్టింగ్ హీరో తో సినిమా చేయబోతున్నాడు.. అర్జున్ రెడ్డి తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ విషయాన్నీ ఇటీవలే వెల్లడించగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి..అయితే ఈ సినిమా కి ఓ కొత్త బ్యానర్ నిర్మాతగా ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటివరకు సుకుమార్ ఎక్కువగా మైత్రి మూవీ మేకర్స్ కె ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు.. రంగస్థలం, పుష్ప తర్వాత ఇక సుకుమార్ తమ సంస్థకు కట్టుబడి వుంటాడని మైత్రి మూవీస్ అధినేతలు నమ్మకం పెట్టుకోవడంలో వింత లేదు.