తాజాగా మరో కథ చాలా మంది హీరోల దగ్గరికి వెళ్లి చివరికి శర్వా దగ్గరికి వచ్చి ఆగింది.. నేను శైలజ సినిమా తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల తన రెండో సినిమా గా అప్పట్లో వెంకటేష్ తో ఓ సినిమా ని ప్లాన్ చేశాడు.. ఆ సినిమా కి ఆడాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ కూడా పెట్టేశాడు.. కానీ స్టోరీ సంతృప్తిగా లేదని సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టేశారు. ఆ తర్వాత రామ్ తోనే మరో సినిమా చేసి ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడు తిరుమల.. ఇటీవలే చిత్రలహరితో హిట్ కొట్టి రామ్ తో రెడ్ సినిమా చేస్తున్న కిషోర్ ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా ని మళ్ళీ హీరోలకు చెప్పడం మొదలుపెట్టాడు..