విజయ్ దేవరకొండ.. ఈ పేరు వినగానే అర్జున్ రెడ్డి సినిమా తప్పక గుర్తొస్తుంది.. కొన్ని సంవత్సరాలకు గానీ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు రావు , హీరోలు రారు.. అలా ట్రెండ్ సెట్ చేసిన హీరో, సినిమా రెండు ఒకేసారి టాలీవుడ్ కి దొరికారు..ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఆ సినిమా కంటెంట్ అని చెప్పాలి.. ఆ కంటెంట్ కంటే విజయ్ చేసిన యాక్టింగ్ అని చెప్పాలి.. రెండు సమపాళ్లలో ఒకరితో ఒకరు పోటీ పడేలా ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుది..