చిన్న నిర్మాతలు కూడా ప్రయోగాత్మకంగా తమ చిత్రాలను విడుదల చేసేందుకు అంత సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇంకా కరోనా వ్యాప్తి ఉన్న దృష్ట్యా అనుమతులు రావడం అనుమానమేనని ఇన్ సైడ్ టాక్. ఎప్పటినుంచో రిలీజ్ నోచుకుని సినిమాలు రిలీజ్ అవుతాయి అని ప్రేక్షకులు ఎదురుచూశారు.. ఉప్పెన, రెడ్, మాస్టర్ సినిమాలు దసరా కి రిలీజ్ అవుతాయి అనుకున్నారు..కానీ ఈ యూనిట్ లు కూడా ససేమీరా ఈ దసరా కి రిలీజ్ చేయమని తేల్చి చెపుతున్నారట.. తెలుగులోనే కాదు తమిళంలోనూ విజయ్ మాస్టర్ ని రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్లు నో అంటున్నారు.