. ఓటీటీలో కొత్త తరహాలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన పలు సినిమాలను పే పర్ వ్యూ అనే పద్దతిలో విడుదల చేశాడు. ఇప్పుడు ఆయన దారిలోనే మరికొందరు స్టార్స్ కూడా తమ సినిమాలను పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారట. ఒక వ్యూ కు టికెట్ ధర 100 నుంచి 150 రూపాయల మధ్య పెడితే వర్కవుట్ అవ్వొచ్చనే దిశగా ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది. మెగా హీరో కాబట్టి రెస్పాన్స్ బాగుండొచ్చని ఒక అంచనా.