ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అరవింద సమేత సినిమా తర్వాత వీరి కాంబో లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా ఎన్టీఆర్ rrr తో కమిట్ లో ఉండడం తో త్రివిక్రమ్ వెయిట్ చేయక తప్పలేదు.. ఎన్టీఆర్‌తో సినిమా లేటయితే కనుక మహేష్‌తో ఈలోగా ఒక సినిమా చేసేయడానికి త్రివిక్రమ్ ప్రయత్నించాడు. కానీ ఎన్టీఆర్ అందుకు అంగీకరించలేదని, ఆర్.ఆర్.ఆర్. షూట్ ముగించుకుని త్వరలోనే ఈ సినిమా మొదలు పెడతానని చెప్పాడని, అంచేత మహేష్ సినిమా దీని తర్వాతే వుంటుందని అంటున్నారు.