అల్లుడు శీనుతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరసగా పరాజయాలు ఎదురైనా పట్టువదలకుండా ఎట్టకేలకు రీమేక్ మూవీ రాక్షసుడుతో హిట్టు కొట్టడం ఫైనల్ గా ఊరట కలిగించింది. ఈ హిట్ తో వచ్చిన ఉత్సాహంతో బెల్లంకొండ ఇప్పుడు మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టగ శ్రీనివాస్ తమ్ముడు సినిమా ఏమైందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. సాయి గణేష్ ని టాలీవుడ్ కు పరిచయం చేసే ఉద్దేశంతో గత ఏడాది పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీని ప్రారంభించారు.దీని తాలూకు ఫస్ట్ లుక్ స్టిల్స్ కూడా బాగానే పబ్లిసిటీ చేశారు. కొంత కాలం షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత ఏమయ్యిందో కానీ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్టు ఫిలిం నగర్ టాక్.