కరోనా కారణంగా ఇన్నాళ్లు మూతబడిపోయిన థియేటర్లు ఈనెల 15 నుంచి ఓపెన్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే.. దీంతో సినిమా ప్రేక్షకులు ఎన్నాళ్లకు థియేటర్లో సినిమా చూసే అవకాశం వచ్చింది అని తెగ సంబరపడిపోతున్నారు.. అయితే వారి సంతోషం ఎంతో సేపు లేదు.. థియేటర్లు అయితే ఓపెన్ అయ్యాయి కానీ సినిమా హలో సినిమా ను రిలీజ్ చేసే ధైర్యం ఏ నిర్మాత చేస్తాడు అన్నది సందేహంగా వుంది.. ఇప్పటికే పలు కీలకమైన, కఠినమైన ఆంక్షలమధ్య సినిమా థియేటర్లను ఓపెన్ చేస్తున్నారు.. సగానికి తక్కువే జనాలు ఉండాలంటున్నారు.. అలాంటి సమయంలో సినిమా బాగుంటేనే థియేటర్లకు వచ్చే జనాలు ఈ టైం లో అసలు బాగున్నా సినిమా కైనా వస్తారా అన్నది డౌట్ గా వుంది..