ఒరేయ్ బుజ్జిగాపై ముందు నుంచీ రాజ్ తరుణ్ మంచి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చినా – అడ్డుకున్నది తరుణే. `సినిమాని థియేటర్లలోనే విడుదల చేద్దాం` అని పట్టుబట్టాడు. అయితే.. నిర్మాతకి మాత్రం ఓటీటీలో విడుదల చేయడం తప్పలేదు. తీరా చూస్తే… రాజ్ తరుణ్ ది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని తేలింది. ఈ సినిమా ఓటీటీలోనూ పల్టీ కొట్టేసింది. ఇదే సినిమా థియేటర్లో విడుదలైతే.. నిర్మాత భారీ నష్టాలు చవి చూసేవాడు. ఒకవేళ ఒరేయ్ బుజ్జిగా సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే రాజ్ తరుణ్ తో చేయడానికి ఏ నిర్మాత ముందుకు వచ్చేవాడు కాదు.. ఓ రకంగా చెప్పాలంటే.. రాజ్ తరుణ్ తొందరపడ్డాడు.