టాలీవుడ్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం సినిమా తోనే సైలెంట్ అవనుందా అంటే నిశ్శబ్దం సినిమా చూసినా ఎవరైనా అదే మాట అంటారు.. బాహుబలి, అరుంధతి, భాగమతి లాంటి సినిమా చేసిన అనుష్క ఇలాంటి చిత్రాన్ని చేయడం పట్ల అందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. స్టోరీ లు వెతుక్కునేప్పుడు కొంచెమైనా జాగ్రత్తలు తీసుకోవద్దా, అసలే తనకు సినిమాలు వస్తాయో రావో అన్న టైం అనుష్క ఇలాంటి సినిమాలు చేసి మరింత పోగొట్టుకోవడం అవసరమా అని ఆమె అభిమానులు సైతం గుసగుసలాడుకుంటున్నారు..