త్రివిక్రమ్ తో మహేష్ సినిమా ఓకే అయ్యిందన్న వార్త ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చే వేసవిలోగా షూటింగ్ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈ రెండు అయ్యాక కానీ ఏది చెప్పడానికి లేదు. రాజమౌళి సినిమాకు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది కాబట్టి మహేష్ ఆలోగా ఇంకో మూవీ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ ఎక్కువ టైం తీసుకునే రకం కాదు. సబ్జెక్టుని బట్టి ఈ మధ్య కాలంలో ఫాస్ట్ గానే తీస్తున్నారు. మరీ అన్ని ఓకే అయితే త్రివిక్రమ్ మహేష్ కాంబో లో సినిమా త్వరలోనే చూడొచ్చన్నమాట..