ఒరేయ్ బుజ్జిగా సినిమా తర్వాత రాజ్ తరుణ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పాలి.. ఈ సినిమా ఫ్లాప్ ఒక్కసారిగా అయన కెరీర్ ని చాలా డౌన్ లోకి తీసుకెళ్ళింది. ఒరేయ్ బుజ్జిగా సినిమా కు ముందు రాజ్ తరుణ్ తో సినిమా చేయాలనుకున్న నిర్మాతలు అందరు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత డ్రాప్ అవుతున్నారు.. అందుకు కారణం రాజ్ తరుణ్ కి మార్కెట్ చాలా బాగా పడిపోవడమే.. టాలీవుడ్ లో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న హీరో ఇక టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి..