ప్రభాస్ నాగ్ అశ్విన్ ల కాంబో లో వస్తున్న సినిమా టైటిల్ ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే దీపికా తో పాటు బిగ్ బీ కూడా సినిమాలో ఉన్నారు.. అయితే అమితాబ్‌ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అతను వెల్లడించాడు. అంతే కాక మరో కీలకమైన విషయాన్ని అతను బయటపెట్టాడు. ఈ సినిమా స్క్రిప్టు ఫస్ట్ డ్రాఫ్ట్‌లో అనుకున్న వర్కింగ్ టైటిల్.. అమితాబ్ చేయబోయే పాత్ర పేరే అని నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. ఐతే ఇప్పుడా టైటిల్‌ను కొనసాగిస్తున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. బిగ్-బి పాత్ర పేరునే సినిమా టైటిల్‌గా పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటే ఆయనది హీరోతో సమానమైన పాత్రగా భావించవచ్చు.