మత్తు వదలరా సినిమాతో తను సంగీత దర్శకుడి అవతారమెత్తి ఆశ్చర్యపరిచాడు. నేపథ్య సంగీతం కీలకంగా మారిన ఆ థ్రిల్లర్ సినిమాతో కాలభైరవకు మంచి పేరే వచ్చింది. దీంతో సంగీత దర్శకుడిగా అవకాశాలు వరుసకట్టాయి. ఈ ఏడాది కాలభైరవ సంగీత దర్శకుడిగా మూడు సినిమాలు అనౌన్స్ కావడం విశేషం. అందులో ఒకటి కలర్ ఫోటో కాగా రెండో ది సత్యదేవ్ నటిస్తున్న శీతాకాలం గుర్తుందా అనే సినిమా.. మరొకటి సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్ కలయికలో రాబోతున్న కొత్త చిత్రం. మొత్తానికి వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కాలభైరవ దేవి, థమన్ లను కొట్టేలానే ఉన్నాడు.