సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో సూపర్ హిట్ కొట్టి సంక్రాంతి రేసులో తనకంటూ ఓ రేంజ్ ఉందని తెలియజేశాడు.. అనిల్ రావిపూడి లాంటి చిన్న డైరెక్టర్ తో ఇంత పెద్ద హీరో సినిమా చేయడం మహేష్ పెద్ద ధైర్యమే చేశాడని చెప్పాలి.. నిజానికి మహేష్ లాంటి సూపర్ స్టార్ లు పెద్ద దర్శకులతో తప్ప సినిమా చేయరు. కానీ ప్రయోగాలకు దగ్గరగా ఉండే మహేష్ ఈ సినిమా చేసి పేరు తో పాటు హిట్ కూడా దక్కించుకున్నాడు.. ఈ సినిమా తర్వాత మహేష్ నుంచి సర్కార్ వారి పాట అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే..