బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.దీనికి తగ్గట్టే BB3 ఫస్ట్ రోర్ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అదరగొట్టింది. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు.