క్రిష్ తన పని పూర్తి చేసుకునే లోగా అయ్యప్పనుం కోషియం రీమేక్ ని చేయాలనీ పవన్ ఆలోచిస్తున్నాడట.. రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఎట్టకేలకు పవన్ ని ఒప్పించినట్టుగా సమాచారం. మరో హీరో క్యారెక్టర్ కోసం రానా ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ ఉంది. అయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేయగలిగే అవకాశం ఉన్న సినిమా. ఏ అరకులోనో పొల్లాచ్చిలోనో లేదా గోదావరి జిల్లాల్లోనో ఈజీగా తీసుకోవచ్చు. క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం లేదు. ఆ రెండు పాత్రల మధ్యే ఎక్కువ కథ సాగుతుంది.