మేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు.. అయితే ఈ సినిమా మొదలు కాకముందే ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. గీతా ఆర్ట్స్ 2 తో పాటు యువి సంస్థ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. నాని బ్లాక్ బస్టర్ భలే భలే మగాడివోయ్ ఈ ప్రొడక్షన్ కాంబోలోనే రూపొందింది. ఇప్పుడు రవితేజతో చేయడం ఇదే మొదటిసారి.తనదైన బ్రాండ్ ఎంటర్ టైన్మెంట్ తో రవితేజ ఎనర్జీని మ్యాచ్ అయ్యే రీతిలో క్రిమినల్ లాయర్ గా చూపించబోతున్నట్టు వినికిడి. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటిస్తారని తెలిసింది.