గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’ తనకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, దాని మీద కొన్నేళ్ల పాటు పని చేశానని.. దానికి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తయ్యాయని చెప్పాడు. ఈ సినిమాకు లొకేషన్లు, సెట్స్ కూడా ఓకే అయినట్లు తెలిపాడు. ఐతే ఆ చిత్రం భారీ కాస్ట్ అండ్ క్రూతో చేయాల్సిందని, వందల మందితో చిత్రీకరణ జరపాలని.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే తక్కువమందితో, పరిమిత లొకేషన్లలో తీయడానికి అవకాశమున్న ‘శాకుంతలం’ను ముందు పూర్తి చేయడానికి నడుం బిగించానని చెప్పాడు గుణశేఖర్.