రాదే శ్యాం తర్వాత వెంటనే ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. భారీ బడ్జెట్ తో , భారీ కథ తో వస్తున్న సినిమా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..