మూడో సినిమాగా మళ్ళీ నాని తో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తునాడు శివ నిర్వాణ.. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలుండగా ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోయింది.. హైదరాబాద్ లో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మూవీ టీమ్ చిత్రీకరణ చేశారు. నాని - రీతూ వర్మ పాల్గొంటున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు యూనిట్ లోని ఒకరికి కరోనా సోకిందట. ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.