చిరు మరొక రీమేక్ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. రీ ఎంట్రీకి ఎంచుకున్న ఖైదీ నెంబర్ 150 అరవం నుంచి తీసుకొచ్చిన కత్తి . త్వరలో మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన తమిళ మూవీని రీమేక్ చేయడం గురించి ఇప్పటికే మిశ్రమ స్పందన ఉంది.అలాగే మలయాళం లూసిఫర్ రీమేక్ కోసం వివి వినాయక్ రంగంలోకి దిగుతాడు. రచయిత ఆకుల శివతో కలిసి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు వేగవంతం చేసినట్టు తెలిసింది.ఇవి చాలవు అన్నట్టు అజిత్ నటించిన మరో సినిమా ఎన్నై ఆరిందాళ్ కూడా చేసే ఆలోచన చిరు చేస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్.