సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకుని చాలా రోజులు అవుతున్నా పుష్ప సినిమా ఇంకా షూటింగ్ జరుపుకోకపోవడం ఇప్పుడు ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ జేస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. అయితే రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి...