రానా పాన్ ఇండియా మూవీ అరణ్య మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి సంబందించి టీజర్ ని కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి సినిమా పై మంచి అంచనాలను ఏర్పరిచేలా ప్లాన్ చేశారు.. కానీ కరోనా అన్ని సినిమాలపై ప్రభావం చూపించినట్లుగా ఈ సినిమా పై కూడా గట్టి ప్రభావం చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది.