బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో బోయపాటి శ్రీను 'భద్ర' సినిమా చేసిన తరువాత మరో మూవీ చేయలేదు. అయితే ఇప్పటికే బోయపాటి శ్రీను దిల్ రాజుతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అంతేకాకుండా విజయ్ దేవరకొండకి ఓ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు అడ్వాన్సులు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో దిల్ రాజు ఓ సినిమా సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.