శర్వానంద్ కి కొన్ని రోజులుగా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి.. అయన విజయాన్ని చూసి చాల రోజులే అయిపొయింది. రాధా,మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం , జాను సినిమా లు దారుణంగా పరాయజం పాలయ్యాయి.. ప్రస్తుతం శ్రీకారం సినిమా షూటింగ్ దశలో ఉంది.. ఈ మూవీపై శర్వా భారీ అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ ని సాధించాలని గట్టి పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. కిషోర్ . బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే తిరుపతిలో షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయాలని శర్వా డైరెక్టర్ మీద ప్రెజర్ పెట్టి మరీ సినిమా చేస్తున్నాడట.