బాలకృష్ణ తో సినిమా విషయంలో బోయపాటికి ఇంత కన్ ఫ్యుజ్ ఏంటి అని అభిమానులు అంటున్నారు.. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ… షూటింగు ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. దానికి కారణం.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక లో ఇంకా స్పష్టత రాకపోవడమే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.ఈ సినిమాలో విలన్ ఎవరు? అనే విషయంలోనూ స్పష్టత లేదు. కెమెరామెన్, ఫైట్ మాస్టర్లు, సంగీత దర్శకుడు.. తప్ప మరెవ్వరి పేర్లూ ఖరారు కాలేదని, అవన్నీ ఫైనల్ అయి, వాళ్ల కాల్షీట్లు దొరికితే తప్ప – షెడ్యూల్ సెట్ చేయడం కుదరదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోయపాటి ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెడతాడో అని ఎదురుచూస్తున్నారు..