టాలెంట్ ఉన్నా హిట్ దక్కని హీరో సూర్య.. తన సినిమా ల్లో ఎప్పుడు వెరైటీ ఉండేలా చూసుకునే సూర్య చాలా వరకు ప్రయోగాత్మక సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.. అందుకే సూర్య సినిమాల్లో హిట్ లకంటే ఫ్లాప్ లే ఎక్కువ.. సౌత్ హీరోల్లోనే హీరో సూర్య ఓ వెరైటీ పేరు ఉంది. అన్ని భాషల్లో సూర్య కి మంచి మార్కెట్ ఉంది.. తమిళం తర్వాత సూర్య ని ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఆదరిస్తారు.. ఇంతవరకు అయితే డైరెక్ట్ తెలుగు సినిమాలు అయితే చేయలేదు కానీ త్వరలో ఆ ముచ్చట కూడా తీర్చేశాడంలో ఎలాంటి సందేహం లేదు..