ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతున్న సమయంలో సినిమా డైరెక్టర్ ఎలాంటి షాట్స్ కాపీ కొట్టినా యిట్టె తెలిసిపోతుంది.. ఇప్పటికే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లను తెగ ట్రోల్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.. థమన్, దేవిశ్రీప్రసాద్ ల ట్యూన్ లో కొంచెం కాపీ అనిపించినా విపరీతంగా ఆడేసుకుంటారు.. ఇక దర్శకుల విషయానికొస్తే గతంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని టైం లో అయితే వారేం చేసిన చెల్లుబాటు అయ్యింది కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకు దొరికిపోతున్నారు..