కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ఇండియన్ 2 సినిమా ని మొదలుపెట్టాడొ తెలీదు కానీ ఆదినుంచి ఈ సినిమాకి అన్ని అడ్డంకులు వస్తున్నాయి.. మొదట్లో నిర్మాతలకు, శంకర్ చెడింది.. ఆ తర్వాత అన్ని సమస్యలు సద్దుమణిగి సినిమా షూటింగ్ మొదలైంది.. ఆ తర్వాత సినిమా లో జరిగిన ఓ ప్రమాదం లో ఇద్దరు సినీ కార్మికులు చనిపోయారు.. దాంతో ఈ సినిమాలోని విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి.. కరోనా వల్ల ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇప్పటివరకు తిరిగి ప్రారంభం కాలేదు.. అన్ని సినిమాలు చక చక షూటింగ్ కి వెళ్లిపోతుంటే శంకర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు..