పవన్ నటిస్తున్న మరో సినిమా కి కూడా తమన్ సంగీత అవకాశం కొట్టేశాడు.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత పవన్ చేయబోయే అయ్యప్పనుం కోషియం రీమేక్ కి కూడా తమన్ సంగీతం వహిస్తుండడం విశేషం..