వినయ విధేయ తర్వాతే బోయపాటి కి హీరో లు దొరకడం కరువైంది.. ఆ సినిమా ఫలితం తర్వాత బోయపాటితో సినిమా చేసే ధైర్యం చెయ్యట్లేదు. బాలకృష్ణ తర్వాత మహేష్ బాబు తో బోయపాటి ఓసినిమా చేయాలనుకున్నాడు. కాకపోతే.. బోయపాటి శైలి తనకు నప్పదని భావించిన మహేష్ చాలా కాలం నుంచి బోయపాటిని దూరంగా ఉంచుతున్నాడు. ప్రభాస్ బోయపాటికే కాదు.. ఎంత పెద్ద దర్శకుడికైనా దొరకలేని పరిస్థితి. బోయపాటితో ట్యూన్ అవ్వగలిగింది, బోయపాటి అడిగిన వెంటనే `సై` అనేది బన్నీనే. కానీ.. బన్నీ చేతిలోనూ చాలా ప్రాజెక్టులున్నాయి. అవన్నీ ఓ కొలిక్కి వచ్చేంత వరకూ. ఈ కాంబినేషన్ కష్టమే. దాంతో బాలకృష్ణ తో సెట్ అయిపోయాడు.. మరి ఈ సినిమా తర్వాత ఎవరు బోయపాటి తో చేయడానికి ముందుకు వస్తారో చూడాలి..