ఖైది నెంబర్ 150 సినిమా తో తన రీ ఎంట్రీ లో చిరంజీవి అదరరగొట్టే సినిమా చేసిన చిరు ఆ తర్వాత సైరా మరో హిట్ కొట్టి తనలో చావ తగ్గిపోలేదని నిరూపించుకున్నాడు.. ఆ రెండు హిట్ సినిమా లతో చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్నారు,. ఇప్పటివరకు పరాజయం అన్నది తెలియని కొరటాల శివ ఈ సినిమా కి దర్శకుడు.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది.. ఇటీవలే వచ్చిన మోషన్ పోస్టర్ కి అందరు ఫిదా అయ్యారు కూడా.. అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. ఇతర హీరోలు మాత్రం తమ సినిమా లు మొదలుపెట్టేసి పూర్తి చేసే దిశగా సాగిపోతున్నారు.