వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తరువాతి సినిమా కి ముహూర్తం కుదిరింది..టాలీవుడ్ లో కామెడీ తో కమర్షియల్ చిత్రాలు చేసే దర్శకులు చాల తక్కువ అని చెప్పాలి.. ఇలా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి.. ఎందుకంటే అటు హీరో ఇమేజ్ ను, ఇటు సినిమా కథకు జోడించి కామెడీ గా సినిమా ను కమర్షియల్ గా తెరకెక్కించాలంటే చాలా టెక్నీక్, సంయమనం ఉండాలి.. అలా టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. తొలి సినిమా పటాస్ తో టాలీవుడ్ ని తనవైపు తిప్పుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో దూసుకుపోయాడు..