ఇటీవలే సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళే సినిమా లు లిస్టు కాస్త ఎక్కువ అవుతుందని చెప్పాలి.. సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో పాటు హిట్స్ కూడా కొడుతుండడంతో బాలీవుడ్ హీరోలు అందరు సౌత్ సినిమా ల్పి ఓ కన్నేసి ఉంచుతున్నారు.. తమ బాడీ లాంగ్వేజ్ లకు పలానా సినిమా సూట్ అవుతుందంటే చాలు వెంటనే ఆ సినిమా ని సొంతం చేసుకుంటున్నారు.. బాలీవుడ్ లో తమ మార్కెట్ కు తగ్గట్లు గా మార్చుకుని హిట్స్ కొట్టి సేఫ్ గా ఉంటున్నారు.. ఇప్పటికే సౌత్ నుంచి వస్తున్న అన్ని సినిమా లు బాలీవుడ్ లో రీమేక్ లు అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా పై కన్నేసింది బాలీవుడ్..