భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది.. తాను ఏ సినిమా చేసినా పెద్దగా వర్కౌట్ అవట్లేదు.. మహేష్ తో చేసిన అర్జున్ సినిమా నే ఒక స్టార్ హీరో తో తాను చేసిన ఆఖరి సినిమా అని చెప్పొచ్చు.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసిన పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.. వరుడు డిజాస్టర్ గా మిగిలిపోయింది.. రుద్రమ దేవి లేట్ గా రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఆ సినిమా పై పెదవివిరిచారు.. సినిమా కి మంచి పేరు వచ్చిన కలెక్షన్ల ప్రభావం చాలా చూపించింది. ఇక రుద్రమదేవి తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని హిరణ్య కశ్యప సినిమా ను రానా తో అనౌన్స్ చేశాడు..