టాలీవుడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలారోజులు అయిపొయింది.. మహానుభావుడు సినిమా తర్వాత శర్వా కి ఆ రేంజ్ హిట్ దొరకలేదని చెప్పాలి.. ఆ తర్వాత చేసిన రణరంగం, పడిపడిలేచే మనసు, జాను సినిమాలు నిరాశపరిచాయి.. తొలిసినిమానుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఆ వైవిధ్యాన్ని ఇప్పుడు చూపెట్టడం లేదనే వార్తలు బాగా వస్తుండడంతో ఇప్పుడు శర్వానంద్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. అందుకు తగ్గట్లే RX100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి తో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు..