వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కరోన తర్వాత పన ప్రారంభం అయ్యింది. చాల రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.. తొందర్లోనే పవన్ కళ్యాణ్ సినిమా చూడొచ్చు అనే ఉత్సాహం వారిలో కనిపిస్తుంది. ఈ సినిమా తో పాటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల ను అనౌన్సు చేశాడు.. వకీల్ సాబ్ సినిమా ని ఆల్రెడీ రిలీజ్ కి సిద్ధం చేసిన పవన్ మిగితా సినిమాలను ఇంకా మొదలుపెట్టలేదు.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరియాడికల్ సినిమా కి ఇంకొంత టైం పట్టేలా ఉంది.. హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించట్లేదు.. దాంతో పవన్ ఫోకస్ మొత్తం వకీల్ సాబ్ మీదే ఉన్నట్లు అర్థమవుతుంది.