రాజమౌళి ఎలాంటి వివాదాలకు పోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతు ఉంటాడు. తమ సినిమాల్లో కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సినిమా లు చేసుకుంటూ పోతాడు..కానీ ఇటీవలే RRR లోని ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ అయ్యాక రాజమౌళి సినిమా వివాదాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.. రాజమౌళి చేసిన బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు అందరి కన్ను రాజమౌళి దర్శకతంలో వస్తున్న RRR పై నే ఉంది..ఇప్పటివరకు తన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు అంటే రాజమౌళి తన సినిమాలను ఎంత బాగా తీస్తాడో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆయన్ని టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. తాను చేసిన ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు.